తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా మహ్మద్ సలీంను కొనసాగించడం చట్ట విరుద్ధమని... ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్ కువాన్ అనే వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సలీం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారని, ఆ తర్వాత ఛైర్మన్ అయ్యారని పిటిషన్లో వివరించారు. ఎమ్మెల్సీ పదవి ముగిసినందున వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా పదవీ కాలం ముగిసినట్లేనని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఎమ్మెల్యేగా ఉంటూ వక్ఫ్ బోర్డులో కొనసాగితే ఆ నిబంధన వర్తిస్తుందని... ఎమ్మెల్సీలకు వర్తించదని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు... తీర్పును వాయిదా వేసింది. వక్ఫ్ బోర్డు సభ్యులుగా మొతాసిం ఖాన్, వహీద్ అహ్మద్, సోఫియా బేగం, తఫ్సీన్ ఇక్బాల్ నియామకాన్ని సవాల్ చేస్తూ మహమ్మద్ యూనస్ అలీ అనే వ్యక్తి మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ను తొలగించాలంటూ హైకోర్టులో పిల్ - waqf board
మహ్మద్ సలీంను వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ హైకోర్టులో సుల్తాన్ కువాన్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ను తొలగించాలంటూ హైకోర్టులో పిల్