గత పది నెలలుగా యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తుందని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి చెల్లింపులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు పికెట్ డిపో ముందు ధర్నాకు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని... 2015 నుంచి కార్మికులకు రావాల్సిన పే స్కేలు త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సంస్థలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.
పికెట్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా - ఆర్టీసీ కార్మికుల ధర్నా
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని పికెట్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. 2015 నుండి రావలసిన పే స్కేలును అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
rtc_employees_dharna