కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సేవలను విస్తృతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నేపథ్యంలో మెడిసిన్‌లో పీజీ పూర్తి చేసిన వారి సేవలను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మెడిసిన్‌లో పీజీ పూర్తి చేసిన వివిధ విభాగాలకు చెందిన 65 మంది నిమ్స్‌లో వైద్య సేవలు అందించనున్నారు. సీనియర్ రెసిడెంట్ వైద్యులుగా ఏడాది పాటున ఒప్పంద ప్రాతిపాదికన వీరు సేవలు అందిస్తారు. నెలకు రూ.70 వేల జీతం అందిస్తూ.. వీరి వైద్య సేవలు ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ.. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మెడిసిన్ ఉత్తీర్ణుల సేవలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్! - రాష్ట్ర ఆర్థిక శాఖ
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య సేవలు విరివిగా అందించేందుకు ప్రభుత్వం అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నది. మెడిసిన్‌లో పీజీ పూర్తి చేసిన విద్యార్థుల సేవలు వినియోగించుకునేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
నిమ్స్‌లో పీజీ ఉత్తీర్ణుల సేవలకు ఉత్తర్వులు!