పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ మరోసారి భగ్గుమన్నాయి. పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వంద మార్కును దాటేశాయి. అసలే కరోనా మహమ్మారి తీవ్రతతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఆకాశమే హద్దుగా చమురు సంస్థలు పెంచుతున్న ధరలతో సామాన్యుడి పరిస్థితి దినదిన గండంగా మారింది.
Petrol Hike:ఆగని పెట్రో బాదుడు.. 17 జిల్లాల్లో సెంచరీ దాటింది - సెంచరీ దాటిన పెట్రోల్
దేశవ్యాప్తంగా పెట్రో మంటలు ఆగడం లేదు. నెల రోజులకు పైగా అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇవాళ మరోసారి పెరిగిన ధరలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంధన ధరలు మండుతున్నాయి. దాదాపు 17 జిల్లాల్లో వంద మార్కును దాటేసింది.
ఇవాళ పెంచిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.99.62, డీజిల్ రూ.94.57కి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, పట్టణాల్లో లీటరు పెట్రోల్ ధర సెంచరీ మార్కు దాటేసింది. కొత్త ధరలతో పలు జిల్లాల్లో సెంచరీ దాటిన పెరిగిన వివరాలు
ఆదిలాబాద్ | రూ.101.64 |
భద్రాద్రి కొత్తగూడెం | రూ.101.76 |
జగిత్యాల | రూ.100.49 |
జోగులాంబ గద్వాల | రూ.101.26 |
కామారెడ్డి | రూ.100.59 |
కుమురం భీం ఆసిఫాబాద్ | రూ.101.23 |
మంచిర్యాల | రూ.100.58 |
మెదక్ | రూ.100.62 |
మహబూబ్‌నగర్ | రూ.100.30 |
నాగర్ కర్నూల్ | రూ.101.08 |
నిర్మల్ | రూ.101.16 |
నిజామాబాద్ | రూ.100.92 |
రాజన్న సిరిసిల్ల | రూ.100.12 |
పెద్దపల్లి | రూ.100.13 |
సంగారెడ్డి | రూ.100.55 |
వికారాబాద్ | రూ.100.66 |
వనపర్తి | రూ.101.28 |
మరో రెండు సార్లు ఇలాగే పెట్రోల్ ధరలు పెరిగినట్లయితే దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వంద మార్క్‌ను దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే అన్ని జిల్లాల్లో కూడా వంద దాటే అవకాశం ఉందని చమురు సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.