హైదరాబాద్ మియాపూర్లోనిజేపీ నగర్‌లోని ఎలైజ్ ఎలైట్ అపార్టుమెంట్‌లో లిఫ్టు సాంకేతిక కారణాలతో అకస్మాత్తుగా ఆగిపోయింది. అందులో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా అరుపులు పెట్టారు. రాత్రి లిఫ్టు నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశారు. అరుపులు విన్న అపార్టుమెంట్లోని నివాసితులు బయటకు వచ్చారు. లిఫ్టు దాదాపు ముప్పై నిమిషాలు ఆగిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేశారు. మరమత్తు చేశాక అందులోని వ్యక్తులు బయటకొచ్చారు.
సినిమాలో మాదిరి.. లిఫ్టులో అరుపులు.. - మియాపూర్
సినిమాలో మాదిరిగా ఓ అపార్ట్మెంట్లో లిఫ్టు అనుకోకుండా ఆగిపోయింది. అందులో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కేకలు వేశారు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సినిమాలో మాదిరి.. లిఫ్టులో అరుపులు..