ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గుత్తుల ప్రశాంత్ (28) హైదరాబాద్‌లో స్థిరపడి ఒక యూట్యూబ్ ఛానల్ కరస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. స్వస్థలం వెళ్లేందుకు బుధవారం కారులో బయలుదేరాడు. విజయవాడ నగర సమీపంలోని గొల్లపూడి వన్ సెంటర్ వద్దకు వచ్చేసరికి అక్కడ స్థానిక ఎస్‌ఐ ఇజ్రాయెల్, సిబ్బంది వాహన తనిఖీలు చేస్తున్నారు.
ఆ సమయంలో పోలీసు బోర్డుతో ఉన్న ప్రశాంత్ కారును కూడా ఆపి తనిఖీ చేసి రికార్డులు చూపించాలని కోరారు. అప్పుడు తాను సైబరాబాద్ పోలీసుస్టేషన్ ఎస్‌ఐగా పని చేస్తున్నానని, తన వాహనాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని వెంటనే పంపాలని కోరాడు. గుర్తింపు కార్డు చూపించాలని పోలీసులు కోరడం వల్ల అతను కార్డును చూపాడు.