తెలంగాణ

telangana

ETV Bharat / state

యువకుడిపై ఎస్​ఐ లాఠీఛార్జ్​, సస్పెండ్ చేస్తూ ఆదేశాలు - news on west godavari lock down

లాక్​డౌన్​ నేపథ్యంలో యువకుడిపై లాఠీఛార్జ్​ చేసి... ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా పెరవలి ఎస్​ఐ సస్పెన్షన్​కు గురయ్యాడు. లాఠీఛార్జ్ దృశ్యాలు వైరల్ అయి డీజీపీ గౌతం సవాంగ్‌ దృష్టికి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

si suspended
యువకుడిపై ఎస్​ఐ లాఠీఛార్జ్​

By

Published : Mar 27, 2020, 10:38 AM IST

యువకుడిపై నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేసిన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తండ్రీ, కుమారుడు సహా ఓ వృద్ధురాలిపైనా ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ లాఠీఛార్జ్ చేశాడు.

డీజీపీ సీరియస్

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో... యూనిట్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం డీజీపీ గౌతం సవాంగ్‌ దృష్టికి వెళ్లింది. విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ పంపించాలి తప్ప.. దాడి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే.. తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యువకుడిపై ఎస్​ఐ లాఠీఛార్జ్​, సస్పెండ్ చేస్తూ ఆదేశాలు

ఇదీ చదవండి: 'నాన్నా బయటికి వెళ్లొద్దు.. కరోనా వస్తుంది'

ABOUT THE AUTHOR

...view details