Diwali festival హిందువుల పండుగలలో దీపావళికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ పర్వదినం రోజు దీపకాంతులలో పట్టణాలు, గ్రామాలు వెలిగిపోతాయి. ఇంటిళ్లిపాది ఒక్కచోట చేరి లక్ష్మీపూజలు, కేదారీశ్వర వ్రతాలు జరుపుకుంటూ భక్తి శ్రద్ధలతో భగవంతున్ని కొలుస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా టపాసులు కాలుస్తూ సందడిగా గడుపుతారు. ఐతే కరోనా మహమ్మారి కారణంగా కొంతకాలం ప్రజలు పండుగను ఘనంగా జరుపుకోలేదు. మహమ్మారి భయం తగ్గి పండగ ఘనంగా జరుపుదామంటే. టపాసుల ధర కంగుతినేలా చేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో మొదలైన దీపావళి సందడి.. పేలుతున్న 'పటాసుల' ధరలు!
Diwali festival in Hyderabad: నగరంలో దీపావళి సందడి మెుదలైంది. పండుగ సమీపించడంతో టపాకుల దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే ఎన్నడూ లేని విధంగా టపాకాయల ధర అమాంతం పెరగటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.. రెండేళ్లు కరోనా వల్ల పండుగ ఘనంగా జరుపకపోకా .. ఇప్పుడు ఈ ధరల కారణంగా టపాసులు పేల్చలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Diwali festival in Hyderabad: ప్రజలంతా ఈసారి గ్రీన్‌కాకర్స్ కోనుగోలు చేయలేక ఆసక్తి చూపుతున్నారని దుకాణ యజమానులు తెలుపుతున్నారు. రసాయనాలు తక్కువగా వినియోగిస్తూ, బూడిద వాడకుండా తయారు చేసే బాణసంచాను గ్రీన్ క్రాకర్స్‌గా పిలుస్తారు. సాధారణ బాణసంచాతో పోలిస్తే వీటితో కాలుష్యం 30 శాతం తక్కువగా ఉంటుంది. ఈ టపాకాయలు 160 డెసిబుల్ శబ్దంతో పేలితే ఇవి 110 డెసిబుల్ మాత్రమే శబ్దం చేస్తాయి. పాఠశాలల్లోనూ గ్రీన్ దీపావళి పై అవగాహన కల్పిస్తుండటంతో పిల్లలు కూడా గ్రీన్‌కాకర్స్ వైపే మెగ్గుచూపుతున్నారు. రెండు, మూడేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది కొనుగోళ్లు తగ్గినప్పటికీ.. గ్రీన్ క్రాకర్స్‌కు ఆదరణ పెరిగిందంటున్నారు అమ్మకదారులు.
గతంలో రెండు మూడు రోజుల ముందు నుంచే ఉండే దీపావళి సందడి.. ఇప్పుడు ముందు రోజు సైతం లేదని వినియోగదారులంటున్నారు. టపాసుల ధర పెరగడంతో.. బాంబుల మోత చాలా వరకూ తగ్గే అవకాశం ఉంది.