తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం నీళ్లెన్ని వాడుకున్నారో లెక్కలున్నాయా: పొన్నాల

కాళేశ్వరం నీళ్లు ఎన్ని వాడుకున్నారో ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయా అని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కేవలం 19 టీఎంసీలు మాత్రమే వాడుకొని.. మిగిలిన జలాలన్నీ సముద్రం పాలు చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు.

pcc former chief ponnala fires on government
కాళేశ్వరం నీళ్లెన్ని వాడుకున్నారో లెక్కలున్నాయా: పొన్నాల

By

Published : Feb 25, 2021, 10:52 PM IST

దేశ చరిత్రలో తెలంగాణలో జరిగినంత అవినీతి ఎక్కడా లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గత మూడు సంవత్సరాల్లో 103 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తే.. ఎన్ని టీఎంసీలను వాడుకున్నారో గణాంకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అందులో 19 టీఎంసీలు తప్ప.. మిగతా నీళ్లన్నీ సముద్రం పాలైంది వాస్తవం కాదా అని నిలదీశారు.

ఒక్క టీఎంసీ నీళ్లను ఎత్తిపోసేందుకు విద్యుత్​ ఛార్జీలే పదిహేను కోట్ల రూపాయల అవుతున్నాయన్న పొన్నాల.. 103 టీఎంసీలకు దాదాపు రూ.1,800 కోట్లు ఖర్చు అవుతున్నాయని ఆరోపించారు. రూ.1800 కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్​.. సముద్రం పాలు చేశారని పొన్నాల ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు తెలంగాణ ప్రజలు మూకుమ్మడిగా దాడి చేస్తూనే ఉంటారని హెచ్చరించారు.

ఇదీ చూడండి: అప్పుడే పార్టీ మారలేదు... ఇప్పుడెందుకు మారతా: పొంగులేటి

ABOUT THE AUTHOR

...view details