కరోనా విజృంభిస్తోన్న సమయంలో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తే... లక్షలాది మంది విద్యార్థులు వైరస్ బారిన పడే అవకాశముందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు గాంధీభవన్ నుంచి అబిడ్స్ జీపీవో వరకు ర్యాలీకి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బారీకేడ్లు పెట్టి భద్రత ఏర్పాటు చేశారు.
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలి: ఉత్తమ్
కొవిడ్ దృష్ట్యా నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో మోదీ, కేసీఆర్ చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కొవిడ్ బారినపడే ప్రమాదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు వాయిదా వేయాలని కోరారు.
uttam kumar reddy
ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అబిడ్స్‌కు వెళ్లే క్రమంలో గాంధీభవన్ వద్దే పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.