కాంగ్రెస్ గుర్తుతో గెలిచి... ఇతర పార్టీలకు వెళ్లిన నేతలను రాళ్లతో కొట్టి చంపాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (PCC Chief Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే వరకూ పోరాడతామన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సీనియర్ నేతలను కలుస్తున్న రేవంత్‌రెడ్డి....ఇవాళ కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ను కలిశారు.
'హస్తం గుర్తుతో గెలిచి పార్టీ మారేవాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి. అలా చేయడంలో నేను ముందు ఉంటాను. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే.. అధికార పార్టీకి అమ్ముడుపోతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై న్యాయస్థానం ద్వారా ప్రత్యేక పోరాటం చేస్తాం. ఈ 12 మంది శాసన సభ్యుల సభ్యత్వాలు రద్దు అయ్యేవరకు కొట్లాడతాం. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారు.