తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్... పీఆర్సీ బకాయిలు చెల్లింపు - తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

PRC arrears to Telangana Government employees: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లింపునకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మే నుంచి 18 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలను చెల్లించనుంది.

Payment of 2 months PRC arrears to Telangana Government employees
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

By

Published : Feb 22, 2022, 3:01 PM IST

PRC arrears to Telangana Government employees

ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రెండు నెలల పీఆర్సీ బకాయిలను మే నుంచి 18 వాయిదాల్లో చెల్లించనున్నారు. 2021 ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన బకాయిల చెల్లింపునకు సంబంధించి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల పీఆర్సీ బకాయిలను మేలో ఇచ్చే ఏప్రిల్ వేతనంతో పాటు ఇస్తారు.

18 వాయిదాల్లో బకాయిల చెల్లింపు ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు కూడా ఇదే తరహాలో చెల్లింపులు చేస్తారు. మరణించిన ఉద్యోగుల బకాయిలు వారి కుటుంబసభ్యులకు ఒకేసారి చెల్లిస్తారు.

ఇదీ చదవండి:ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రకాశ్​రాజ్​కు​ రాజ్యసభ సీటు?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details