తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకూడదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కోరారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకోవాలని సూచించారు. కార్మికులను తొలగింపుపై వస్తున్న వార్తలు తనని కలవరపెడుతున్నాయని పవన్ ఆవేదన వెలిబుచ్చారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నట్లు కాటమరాయుడు స్పష్టం చేశారు.
కార్మికుల పక్షాన.. కాటమరాయుడు - TSRTC NEWS
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రముఖ సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన కోరారు.
కాటమరాయుడు
ఇదీ చూడండి : ఇంటిబాట పట్టిన నగర వాసులు