తెలంగాణ

telangana

ETV Bharat / state

Pawan Khera Fires on BRS Government : తెలంగాణలో అన్నీ పెద్ద పెద్ద కుంభకోణాలే: పవన్‌ ఖేరా - బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పవన్‌ ఖేరా మండిపాటు

Pawan Khera Fires on BRS Government : తెలంగాణలో జరుగుతున్న పెద్ద పెద్ద కుంభకోణాల గురించి చర్చకు సిద్ధమని ఏఐసీసీ మీడియా విభాగం ఇంఛార్జీ పవన్ ఖేరా ప్రకటించారు. కేసీఆర్‌ తీసుకొచ్చిన మేనిఫెస్టో, తెలంగాణ ఎన్నికల గురించి కవిత మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు. గౌతం అదానీ గురించి కవిత ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల థీమ్‌ 'భారత్ జుడేగా.. ఇండియా జీతేగా..' అని పవన్‌ ఖేరా స్పష్టం చేశారు.

Pawan Khera
Pawan Khera Fires on BRS Government

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 3:41 PM IST

Updated : Sep 16, 2023, 3:47 PM IST

Pawan Khera Fires on BRS Government : హైదరాబాద్‌ హోటల్‌ తాజ్‌ కృష్ణలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఏఐసీసీ మీడియా విభాగం ఇంఛార్జీ పవన్ ఖేరా.. సీడబ్ల్యూసీలో స్వేచ్ఛా పూర్వక వాతావరణంలో చర్చ జరుగుతుందన్నారు. ఇదే తమ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న సమావేశ నిర్ణయాలను.. సాయంత్రం వెల్లడిస్తామని పవన్‌ ఖేరా తెలిపారు. ఏడాది కాలంగా కాంగ్రెస్‌ రోడ్లపైనే ఉండటంతో.. హస్తం పార్టీ రోడ్లపైకి రాదనే అపవాదు తొలగిపోయిందని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేరుస్తామని హామీ ఇస్తున్నామని చెప్పారు. ఓవైపు సైనికులు మరణిస్తుంటే.. బీజేపీ సంబురాలు చేసుకుంటుంటే సైన్యం మనోధైర్యం దెబ్బతింటుందోన్న ఆయన.. ధరలు, చైనా చొరబాట్లు, మణిపూర్ లాంటి వాటి గురించి అమిత్ షా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.

CWC Meeting in Hyderabad Today : హైదరాబాద్‌లో ఇవాళ, రేపు కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు

Pawan Khera Comments on MLC Kavitha : సీడబ్ల్యూసీ సమావేశం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు వేశారన్న పవన్ ఖేరా.. తెలంగాణలో అన్నీ పెద్ద పెద్ద కుంభకోణాలే వినిపిస్తున్నాయన్నారు. ధైర్యంగా ముందుకు వస్తే అన్ని కుంభకోణాల గురించి మాట్లాడదామన్న ఆయన.. కేంద్రంతో ఎలా పోరాడుతున్నామో కవితకు తెలియదా అని ప్రశ్నించారు. గౌతమ్ అదానీ గురించి కవిత ఎందుకు మాట్లాడరని విమర్శలు గుప్పించారు.

Congress Vijayabheri Sabha in Tukkuguda : 'విజయ భేరి' విజయానికి కాంగ్రెస్ పక్కాప్లాన్.. సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్

కేంద్రంతో ఎలా పోరాడుతున్నామో కవితకు తెలియదా? అదానీ గురించి కవిత ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు అరెస్టును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. సైనికుల పేరు చెబుతూ ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారు. పదేళ్ల మోదీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. మోదీ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. సమస్యలు, ఇతర అంశాల నుంచి దృష్టి మళ్లించడానికే జమిలి ఎన్నికల ప్రస్తావన తెరపైకి తీసుకొచ్చారు.- పవన్‌ ఖేరా, ఏఐసీసీ మీడియా విభాగం ఇంఛార్జీ

Congress Screening Committee to Meet on 20th September : ఈ నెల 20న కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ సమావేశం.. అప్పుడే అభ్యర్థుల జాబితా

సమస్యలు, ఇతర అంశాల నుంచి దృష్టి మళ్లించడానికే జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారన్న పవన్‌ ఖేరా.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు మాత్రమే అయిందని, హామీల అమలు ప్రారంభమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు గడిచాయని.. హైదరాబాద్‌లో ఇంకా రోడ్లపై వర్షం నీరు నిలుస్తూనే ఉందన్నారు. తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చిన హామీలు, అమలుపై చర్చకు సిద్ధమని ప్రకటించారు.

Congress Vijayabheri Sabha Arrangements : చరిత్రలో నిలిచేలా కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ..!

సీడబ్ల్యూసీ సమావేశాల నిర్ణయాలను సాయంత్రం వివరిస్తాం. తెలంగాణలో అన్నీ పెద్ద కుంభకోణాలే వినిపిస్తున్నాయి. ధైర్యంగా ముందుకు వస్తే అన్ని కుంభకోణాల గురించి మాట్లాడదాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు మాత్రమే అయింది. హామీల అమలు ప్రారంభమైంది. కేసీఆర్ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు గడిచాయి. హైదరాబాద్‌లో ఇంకా రోడ్లపై వర్షం నీరు నిలుస్తూనే ఉంది. తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చిన హామీలు, అమలుపై చర్చకు సిద్ధం. - పవన్‌ ఖేరా, ఏఐసీసీ మీడియా విభాగం ఇంఛార్జీ

Pawan Khera Fires on BRS Government తెలంగాణలో అన్నీ పెద్ద పెద్ద కుంభకోణాలే పవన్‌ ఖేరా

CWC Meetings Schedule Hyderabad 2023 : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. షెడ్యూల్ ఇదే

Last Updated : Sep 16, 2023, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details