రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం భాజపాతో కలిసి నడుస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండు పార్టీల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. విజయవాడలో జరిగిన చర్చల అనంతరం పవన్ మాట్లాడారు. భాజపా పెద్దలతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నామన్నారు. భాజపాతో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను వైకాపా నీరుకార్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే భాజపాతో పొత్తు పెట్టుకుంటున్నామన్న పవన్.. భేషరతుగా కలిసి పనిచేస్తామన్నారు. రెండు పార్టీల్లో అవగాహన లోపం రాకుండా అన్నీ చర్చించామని పవన్ తెలిపారు. భాజపా-జనసేన మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెదేపా, వైకాపా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న పవన్.. భాజపా, జనసేన రూపంలో రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్ షా నమ్మకాన్ని నిలబెడతామని స్పష్టం చేశారు.
2024లో వచ్చేది భాజపా-జనసేన ప్రభుత్వమే : పవన్
రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల దృష్ట్యా భాజపా కలిసి నడుస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. మోదీ, అమిత్ షా నమ్మకాన్ని నిలబెడతామని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-భాజపా అధికారం చేపడుతుందన్న పవన్... ఆ దిశగా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం భాజపా-జనసేనదేనన్నారు. పార్టీల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోయాయని పవన్ వ్యాఖ్యానించారు.
PAVAN