జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడిన పవన్ కల్యాణ్‌కు వైద్య సేవలు అందించిన డాక్టర్లు.. మూడు రోజుల కిందట ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. కరోనా అనంతరం వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయని... ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్ - Pawan Kalyan Latest News
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. మూడ్రోజుల కిందట చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పవన్‌కు నెగెటివ్ వచ్చింది. ఆరోగ్య పరంగా పవన్ కల్యాణ్‌కు ఇబ్బందులు లేవని వైద్యులు వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్
తన ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించినవారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున... ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని పవన్‌కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:కొవిడ్ చికిత్సలో సీటీ స్కాన్ ఎంత మేరకు ఉపయోగపడుతుంది?