జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాకు పేరు మార్చాలని డిమాండ్ చేశారు. అధికార మార్పిడి తర్వాత జనసేన(Janasena) ఆ జిల్లా పేరును మార్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతుందని తెలిపారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త డిమాండ్.. ఆ పేరు మార్చాల్సిందే... - pawan kalyan latest updates
కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు.
13:52 October 22
పవన్ కల్యాణ్ కొత్త డిమాండ్.. ఆ పేరు మార్చాల్సిందే...
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా(Kurnool district)కు దామోదరం సంజీవయ్య (damodaram sanjivayya) పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు. వైకాపా పట్టించుకోకపోతే.. అధికార మార్పిడి తర్వాత జనసేన ఆ ప్రక్రియ మెుదలు పెడుతుందని వెల్లడించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి సంజీవయ్య అని పేర్కొన్న పవన్ (Pawan Kalyan).. ఆయన పేరు ఒక్క పథకానికీ పెట్టలేదని విమర్శించారు.
- సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తా...
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఆయన తెలియజేశారు. సంజీవయ్య నిత్యస్మరణీయులన్న పవన్.. ఆయన చేసిన సేవలకు గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.కోటి నిధి ఏర్పాటు చేయనున్నట్లు జనసేనాని స్పష్టం చేశారు.
కడు పేదరికంలో పుట్టిన సంజీవయ్య అసాధారణ వ్యక్తిగా ఎదిగారని చెప్పిన పవన్.. వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు బీజాలు వేశారని కొనియాడారు. రెండేళ్లే సీఎంగా ఉన్నప్పటికీ.. సంజీవయ్య ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ప్రశంసించారు. హైదరాబాద్ పరిసరాల్లోని 6 లక్షల ఎకరాలు పేదలకు పంచారని.. మొదటగా వృద్ధులు, వికలాంగుల పింఛన్లు ప్రారంభించింది సంజీవయ్యే అని పవన్ గుర్తు చేశారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారని చెప్పారు. ఈ పోస్టుకు దామోదరం సంజీవయ్య ఇంటి ఫొటోలను జతచేశారు.
ఇదీ చదవండి:'మా' ఎన్నికల్లో వైకాపా జోక్యం: ప్రకాశ్‌రాజ్