తెలంగాణ

telangana

ETV Bharat / state

Pattana Pragathi Day In Telangana : నేడు రాష్ట్రవ్యాప్తంగా 'పట్టణ ప్రగతి' వేడుకలు

Pattana Pragathi Celebrations In Telangana : రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు జరుగుతున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ప్రట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అధికార యాంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. 2020లో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్కారు.. హైదరాబాద్ సహా అన్ని నగరాలూ, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొంది.

Pattana Pragathi Day In Telangana
Pattana Pragathi Day In Telangana

By

Published : Jun 16, 2023, 7:55 AM IST

Telangana Pattana Pragathi 2023 :తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ పట్టణ ప్రగతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరబాద్ శిల్పకళా వేదికలో వైభవంగా వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారు.

Pattana Pragathi Day In Telangana :ఉత్తమ మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లను, చైర్మన్లను, మేయర్లను, ఉద్యోగులను ఈ సందర్భంగా ప్రభుత్వం సత్కరించనుంది. ఆయా మున్సిపాలిటీలలో చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలు, పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును ప్రజలకు వివరించాలని సూచించింది. జాతీయ స్థాయిలో పట్టణ అభివృద్ధిలో సాధించిన విజయాలు, అవార్డుల వివరాలను కూడా ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు.

Telangana Pattana Pragathi Celebrations Today : పట్టణీకరణలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని సర్కారు ప్రకటించింది. దేశ జనాభాలో 35.1 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా.. రాష్ట్రంలో ఏకంగా 47.6 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారని తెలిపింది. 2020లో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్కారు.. హైదరాబాద్ సహా అన్ని నగరాలూ, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొంది.

Telangana Decade Celebrations 2023 :గడచిన 9 ఏళ్లలో కేంద్రం నుంచి 23 పట్టణ స్థానిక సంస్థలకు స్వచ్​ సర్వేక్షణ్ అవార్డులు, 3 పట్టణ స్థానిక సంస్థలకు ఇండియన్ స్వచ్ఛత లీడ్అవార్డులు లభించిన విషయాన్ని కేసీఆర్ సర్కార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ఆసియా పసిఫిక్ స్థిరత్వ సూచి 2021 ప్రకారం... ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో స్థిరపమైన నగరాల్లో హైదరాబాద్ చోటు సంపాదించుకుందని తెలిపింది. ఐక్య రాజ్య సమితిలోని అర్బర్ డే ఫౌండేషన్ ఆహార, వ్యవసాయ సంస్థ వరుసగా రెండు సార్లు హైదరాబాద్​ను ప్రపంచ వృక్ష నగరంగా గుర్తించిందని స్పష్టం చేసింది.

Pattana Pragathi Celebrations In Telangana :రాష్ట్రంలోని 142 పట్టణ ప్రాంతాల్లో కోటి నలభై నాలుగు లక్షల జనాభా నివసిస్తోందని తెలిపింది. ఇప్పటి వరకు పట్టణాల సర్వతోముఖాభివృద్ధి కోసం 4138.84 కోట్ల నిధులు ఖర్చుచేసిట్టు వివరించింది. పట్టణాల్లో రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణం, విద్యుత్ దీపాలు, పార్కుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, హరిత హారం, డంపింగ్ యార్డ్స్ వ్యర్ధాల రీసైక్లింగ్, వైకుంఠధామాలు, ఓపెన్ జిమ్, క్రీడా ప్రాంగణాలు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల వంటి వాటిని అందుబాటుకి తెచ్చి పట్టణాల వృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details