హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైమానిక దళాధిపతి ఆర్.కె.ఎస్.భదౌరియా పాల్గొన్నారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న123 మంది ప్లయింగ్ ఆఫీసర్స్, 11 మంది నేవి కోస్ట్ గార్డ్ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కర్నల్ సంతోష్‌బాబు బృందానికి నివాళులర్పించారు.
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆకట్టుకున్న పాసింగ్ అవుట్ పరేడ్ - Passing Out Parade NEWS
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. వైమానిక దళ అధిపతి ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ముఖ్య అతిథిగా హాజరై గౌరవవందనం స్వీకరించారు.
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్
కార్యక్రమంలో వైమానిక దళం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సూర్యకిరణ్, ధ్రువ హెలికాపర్లు, హాక్ జెట్ ట్రైనర్ల విన్యాసాలు ముఖ్య ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చూడండి:'చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక 'ధూర్త శక్తి''
Last Updated : Jun 20, 2020, 10:47 AM IST