తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి పాసులు అక్కర్లేదు: డీజీపీ - migrant people

లాక్​డౌన్​ నేపథ్యంలో గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని పోలీస్​ శాఖ వెల్లడించింది.

Passengers no  need passes for going to other states
'ఇక నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి పాసులు అక్కర్లేదు'

By

Published : Jun 2, 2020, 8:00 PM IST

ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని పోలీస్ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్​లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు అంతర్రాష్ట్ర ప్రయాణాలకు డీజీపీ కార్యాలయం ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ సడలింపులలో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్​పోర్ట్ పాసులను జారీ చేయడాన్ని పోలీసు శాఖ నిలిపివేసింది.

తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా వాహన పాసులను అడగడం లేదు. ఆంధ్రప్రదేశ్​కు వెళ్లాల్సిన వారు స్పందన యాప్​లో, కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేవారు ఆ రాష్ట్రానికి చెందిన సేవా యాప్​లోనూ, మహరాష్ట్రకు వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్​లో ప్రయాణికుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: 'గనిలో పేలుడు మానవ తప్పిదమా.. సాంకేతిక లోపమా?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details