తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పాక్షికంగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులు - tsrtc strike

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. అధికారులు ప్లాన్​బీ అమలు చేశారు. రోజువారీ వేతనంతో తాత్కాలిక సిబ్బందిగా పనిచేందుకు ప్రైవేటు డ్రైవర్లను నియమిస్తున్నారు. దీనితో పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు పాక్షికంగా నడుస్తున్నాయి.

rtc

By

Published : Oct 5, 2019, 10:12 AM IST

Updated : Oct 5, 2019, 10:39 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కానీ పలు జిల్లాల్లో పాక్షికంగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. పోలీసుల భద్రత నడుమ డిపోల నుంచి ఆర్టీసీ, అద్దె బస్సులు బయటకు వెళ్తున్నాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను అధికారులు నడుపుతున్నారు. రోజువారీ వేతనంపై తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు నియమిస్తున్నారు. తాత్కాలిక సిబ్బందిగా పనిచేసేందుకు పలు డిపోలకు ప్రైవేట్‌ డ్రైవర్లు భారీగా తరలివస్తున్నారు. వారికి అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా డిపోల నుంచి ఆర్టీసీ, అద్దె బస్సులు రోడ్డెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3వేలకు పైగా బస్సులు నడుస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో 92 బస్సులు... సంగారెడ్డి డిపో నుంచి 50 శాతం బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

పాక్షికంగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులు
Last Updated : Oct 5, 2019, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details