హైదరాబాద్ బిర్యానీ రుచిని ప్రపంచానికి చాటిన పారడైజ్ హోటల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ వరల్డ్ కప్ సీజన్లో తమ హోటల్లో భోజనం చేసి.. ఆ ఫొటోలను ఇన్స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేయాలి. అందులోంచి ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి.. వారికి ఏడాది పాటు వారానికి ఒక బిర్యానీని ఉచితంగా అందించనున్నట్లు యజమాని అలీ మస్కతి ప్రకటించారు. ఇప్పటికే ఎంపిక చేసిన వారికి శుక్రవారం బహుమతులు అందజేశారు. ప్రపంచకప్ ముగిసే వరకు ఈ ఆఫర్ ఉంటుందని అలీ పేర్కొన్నారు.
ఫొటో బాగుంటే ఏడాది పాటు బిర్యానీ ఉచితం - offer
ఈ ప్రపంచకప్ సీజన్లో హైదరాబాద్ పారడైజ్ హోటల్ సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. తమ హోటల్లో భోజనం చేస్తూ దిగిన ఫొటోలను సామాజిక మాధ్యామాల్లో పెట్టాలి. అందులోంచి ఉత్తమ ఫొటోను ఎంపిక చేసి.. గెలిచినవారికి ఏడాదిపాటు వారానికి ఉచిత బిర్యానీ ఇవ్వనున్నారు.
ఫొటో బాగుంటే ఏడాది పాటు బిర్యానీ ఉచితం