తెలంగాణ

telangana

నెక్లస్‌రోడ్‌లో పక్కా హైదరాబాద్​

హైదరాబాద్​ నగరవాసులు సంతోషంగా షాపింగ్‌ చేసుకునేందుకు పక్కా హైదారాబాద్​ పేరుతో నెక్లస్‌రోడ్‌లో ప్రదర్శన ఏర్పాటైంది. అనేక రకాల స్టాళ్లతో పాటు వినోదాత్మక సదుపాయాలు ఏర్పాటు చేశారు. జనవరి 1 వరకూ ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ ప్రదర్శన ఉంటుంది.

By

Published : Dec 28, 2019, 1:48 PM IST

Published : Dec 28, 2019, 1:48 PM IST

నెక్లస్‌రోడ్‌లో పక్కా హైదరాబాద్​
నెక్లస్‌రోడ్‌లో పక్కా హైదరాబాద్​

నెక్లస్‌రోడ్‌లో ఏర్పాటైన పక్కా హైదరాబాద్‌ ప్రదర్శనకు నగరవాసుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పలు వినోదాత్మక కార్యక్రమాలతో పాటు చిన్నారుల నుంచి పెద్దల వరకు సరదాగా ఎంజాయ్‌ చేసే విధంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 200 స్టాల్స్‌లో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించారు.

చోటా భీమ్‌, లిటిల్‌ సింగం, స్టాళ్ల వద్ద ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈటీవీ భారత్‌ స్టాల్​లో యాప్‌ను చిన్నారుల నుంచి పెద్దల వరకు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఎప్పటికప్పడు కొత్త సమాచారంతో అప్​డేట్​ అవుతుందని డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నామని వారు అంటున్నారు. జనవరి 1 వరకూ ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ ప్రదర్శన కొనసాగనుంది.

నెక్లస్‌రోడ్‌లో పక్కా హైదరాబాద్​

ఇదీ చూడండి : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లు

ABOUT THE AUTHOR

...view details