తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైల్వే ఆస్పత్రిలో వాక్సిన్ పంపిణీ చేయాలి' - Central Railway Hospital latest news

సికింద్రాబాద్ కేంద్రీయ రైల్వే ఆస్పత్రిలో వాక్సిన్ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఉప సభాపతి పద్మారావు గౌడ్ సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్​కు లేఖ రాశారు. రైల్వే మజ్దూర్ యూనియన్, కార్మిక సంఘాలు కృతఙ్ఞతలు తెలిపాయి.

Padmarao Goud letter to Minister Itala Rajender
మంత్రి ఈటల రాజేందర్​కు పద్మారావు గౌడ్ లేఖ

By

Published : Jan 13, 2021, 10:16 PM IST

సికింద్రాబాద్ కేంద్రీయ రైల్వే ఆస్పత్రిలో వాక్సిన్ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి శాసన సభ ఉప సభాపతి పద్మారావు గౌడ్ సూచించారు. రైల్వే కార్మికులు, వారి కుటుంబాలకు అవకాశం కల్పించాలని కోరారు. అందుకోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్​కు లేఖ రాశారు.

వారికి మేలు..

ఆస్పత్రిలో సదుపాయాన్ని కల్పించడంతో.. నిత్యం ప్రతికూల పరిస్థితుల్లో సైతం విధులు నిర్వర్తించే కార్మికులు, వారి కుటుంబాలకు మేలు కలుగుతుందని ఉప సభాపతి పేర్కొన్నారు. గతంలో అయన విజ్ఞప్తితో రైల్వే దవాఖానాలో కొవిడ్ రోగుల చికిత్సకు ప్రత్యేక వార్డును ప్రభుత్వం మంజూరు చేసింది.

హర్షం వ్యక్తం..

ఆస్పత్రిలో వాక్సినేషన్​ సదుపాయాన్ని కల్పించాలని ప్రతిపాదించడంతో పద్మారావు గౌడ్​కు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ శంకర్ రావు కృతఙ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:'వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా టీకా'

ABOUT THE AUTHOR

...view details