చిన్నారులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ రన్నర్స్ అనే సంస్థ వేసవికాలంలో పిల్లలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ధూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఈ రోజు ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. హైదరాబాద్ మొత్తం కాలుష్యంతో నిండిపోయినందున... నగరానికి దూరంగా ఇలాంటి పరుగు కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆహ్లాదకరంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం ఇలాంటి క్యాంపులు కొనసాగిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
పిల్లలకు ఆరోగ్యం... పెద్దలకు ఆహ్లాదం - KIDS
ట్రాఫిక్ చప్పుళ్లకు దూరంగా.. అందమైన అడవి ప్రాంతంలో... చిన్నారులు పరుగులు పెడ్తూ తల్లిదండ్రులను అలరించారు. పిల్లలకు ఆరోగ్యంతో పాటు పెద్దలకు ఆనందాన్ని మిగిలేలా చేశారు హైదరాబాద్ రన్నర్స్ సంస్థ వారు.
పిల్లలకు ఆరోగ్యం... పెద్దలకు ఆహ్లాదం