టీఎస్పీఎస్సీ నియామకాల్లో ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలంటూ తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
'ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలి'
రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు టీఎస్పీఎస్సీ నియామకాల్లో ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలని అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఉద్యోగులతో కలిసి సదస్సు నిర్వహించారు.
'ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలి'
వైద్యారోగ్యశాఖలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయించాలన్నారు. రెగ్యులర్ నియామకాలు జరిగినప్పుడు ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.