తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2022, 2:57 PM IST

ETV Bharat / state

రెండోరోజు.. ఓయూలో విద్యార్థినుల ఆందోళన

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినిలు రెండోరోజు ఆందోళనకు దిగారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద ధర్నా చేపట్టారు.

students  protest
విద్యార్థినుల ఆందోళన

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినిలు రెండోరోజు ఆందోళనకు దిగారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద ధర్నా చేపట్టారు. మహిళా వసతి గృహంలో మంచి నీటి సౌకర్యం లేదని, నాణ్యమైన ఆహారం కూడా అందించడం లేదని వాపోయారు. నిన్నటి నుంచి తాము నిరసన వ్యక్తం చేస్తున్న అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థినులు స్పష్టంచేశారు. మహిళా వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థినులు ఆదివారం రోడ్డెక్కారు.

వాహనాలను అడ్డుకుంటున్న విద్యార్థినులు

మధ్యాహ్నం లంచ్‌ టైమ్‌లో లేడిస్‌ హాస్టల్‌ మెస్‌లో ఓ విద్యార్థినికి చికెన్‌ కర్రీలో పురుగు వచ్చిందని అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థినులంతా కలిసి వసతిగృహం ముందు బైఠాయించారు.

ఇదీ చదవండి: OU LADIES HOSTEL: చికెన్‌ కర్రీలో పురుగు.. ఓయూలో విద్యార్థినుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details