ఇంజినీరింగ్ విద్యార్థుల పరీక్షల నిర్వహణకు ఓయూ రీషెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి పలు దఫాలుగా సెమిస్టర్లను నిర్వహించేందుకు తేదీలను ప్రకటించింది. పరీక్ష కాలవ్యవధిని రెండు గంటలుగా అధికారులు నిర్ణయించారు.
23 నుంచి ఓయూ ఇంజినీరింగ్ పరీక్షలు - హైదరాబాద్ వార్తలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విద్యార్థుల పరీక్షల రీషెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో వాయిదా వేసిన పరీక్షలను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు తేదీలను ప్రకటించింది. పరీక్ష వ్యవధిని రెండు గంటలుగా నిర్ణయించారు.
ఓయూ ఇంజినీరింగ్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల
కరోనా వల్ల నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. మొదటి, మూడో ఏడాది విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహించనుండగా, రెండో ఏడాది పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సమయాన్ని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్లో( https://www.ouexams.in/examnotifications ) సంప్రదించాలని అధికారులు సూచించారు.