హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు సోమవారం ఆందోళన ర్యాలీ నిర్వహించారు. ఇంజినీరింగ్ విద్యార్థినుల హాస్టల్లోకి ప్రవేశించి బెదిరించిన ఆగంతుకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద భైఠాయించి నినాదాలు చేశారు.
భద్రత కల్పించాలంటూ ఓయూ విద్యార్థినుల ధర్నా - హైదరాబాద్
ఓయూలో తమకు భద్రత కల్పించాలంటూ విద్యార్థినులు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు.
భద్రత కల్పించాలంటూ ఓయూ విద్యార్థినుల ధర్నా