తెలంగాణ

telangana

By

Published : Mar 18, 2021, 3:41 PM IST

Updated : Mar 18, 2021, 3:51 PM IST

ETV Bharat / state

'ఓయూ, నిరుద్యోగులకు ఒక్క రూపాయి కేటాయించలేదు: భాజపా

తెలంగాణ బడ్జెట్​ పుస్తకాలకు మాత్రమే పరిమితమని భాజపా ఎమ్మెల్యేలు విమర్శించారు. నిరుద్యోగ భృతికి ఒక్కరూపాయి కేటాయించలేదని మండి పడ్డారు. భాగ్యనగర రోడ్లకు సరియైన ప్రణాళిక ప్రకారం నిధులు కేటాయించలేదని, ఉస్మానియా ఆస్పత్రి, క్రీడా రంగం సహా అనేక అంశాలను మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.

osmania-university-unemployed-students-one-rupee-cannot-be-allocated-telangana-budget
'ఓయూ, నిరుద్యోగులకు ఒక్క రూపాయి కేటాయించలేదు: భాజపా

'ఓయూ, నిరుద్యోగులకు ఒక్క రూపాయి కేటాయించలే'

గణాంకాలు అందంగా ఉన్నాయి తప్పితే.. బడ్జెట్‌ మేడిపండు మాదిరిగా ఉందని భాజపా ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. బడ్జెట్‌ను చూస్తే కళ్లు తిరిగి కింద పడిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. గల్ఫ్‌ కార్మికుల కోసం 500 కోట్లు కేటాయిస్తామని.. 2014 నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వం చెబుతూనే ఉందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం గన్‌పార్కు వద్ద రాజాసింగ్‌తో కలిసి ఆయన ప్రశ్నించారు.

నివాసయోగ్యమైన నగరాల స్థానాల్లో 4 నుంచి హైదరాబాద్ 24వ స్థానానికి పడిపోయిందని రఘునందన్‌రావు దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఓయూకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్‌ పుస్తకాలకే పరిమితం తప్పితే.. అమలు చేయరని రాజాసింగ్‌ ఆరోపించారు. ఎల్లుండి సమావేశాల్లో ప్రతి అంశం మీద ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి 200 కోట్లతో అభివృద్ది చేస్తామన్న విషయం మరిచిపోయారని అన్నారు. క్రీడా రంగానికి ఒక్క రూపాయి కేటాయించలేదని మండి పడ్డారు. ప్రభుత్వం సమయం ఇస్తే అన్ని అంశాలను సభలో ప్రస్తావిస్తామన్నారు.

ఇదీ చూడండి :కరోనా 2.0: ఆ నగరంలో బస్సులు బంద్

Last Updated : Mar 18, 2021, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details