తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలుగు విద్యార్థుల పట్ల యూజీసీ  వివక్ష' - యూజీసీ

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నేషనల్ రీసెర్చ్ ఫెలోషిప్​ల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ ఓయూలో నిరుద్యోగ విద్యార్థి ఫ్రంట్ ఛైర్మన్ దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్​ చేశారు.

UGC

By

Published : Aug 15, 2019, 7:34 PM IST



తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నేషనల్ రీసెర్చ్ ఫెలోషిప్​ల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ ఓయూలో నిరుద్యోగ విద్యార్థి ఫ్రంట్ ఛైర్మన్ దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్లకార్డ్స్ పట్టుకొని విద్యార్థులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ ఈనెల 14న యూజీసీ విడుదల చేసిన జాబితాలో ఓబీసీ కోటాలో తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది విద్యార్థులనే ఎంపిక చేశారని మండిపడ్డారు. ఓయూ నుంచి దాదాపు వెయ్యి మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా...కేవలం ఏడుగురినే ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల పరిశోధక విద్యార్థుల పట్ల యూజీసీ వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్​ చేశారు.

'తెలుగు విద్యార్థుల పట్ల యూజీసీ వివక్ష'

ABOUT THE AUTHOR

...view details