తెలంగాణ

telangana

ETV Bharat / state

Food Distribution: కరోనా రోగులకు అండగా స్వచ్ఛంద సంస్థలు - స్వచ్ఛంద సంస్థలు

కరోనా వచ్చిందంటే ఆత్మీయులు సైతం అమడదూరం పరిగెత్తుతున్నారు. కరోనా వచ్చి హోం ఐసోలేషన్‌లో భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి పౌష్టికాహారం(Food Distribution) అందిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు భరోసా కల్పిస్తున్నాయి.

Food distribution: కరోనా రోగులకు అండగా స్వచ్ఛంద సంస్థలు
Food distribution: కరోనా రోగులకు అండగా స్వచ్ఛంద సంస్థలు

By

Published : Jun 5, 2021, 3:34 PM IST

హైదరాబాద్ వెంకటగిరిలోని వేదం ఫౌండేషన్ హోం ఐసోలేషన్​లో ఉన్న కరోనా పేషంట్లకు ఉచితంగా భోజనం(Food Distribution) అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. హోం ఐసోలేషన్‌ ఉన్న వారితోపాటు నగరంలోని వివిధ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న వారికి, వారి సహాయకులకు సైతం భోజనం అందిస్తున్నారు.

12 వందల మందికి భోజనం

హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా పేషంట్లకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రతి రోజు భోజనం అందిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్‌ అరవింద్‌ అలిశెట్టి తెలిపారు. దాదాపు ప్రతి రోజు 12 వందల మందికి భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ఇందు కోసం దాదాపు 25 మంది మధ్యాహ్నం, రాత్రి సమయంలో ఆహారం తయారు చేయడంతో పాటు ప్యాకింగ్, డెలివరీ కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

ఆస్పత్రుల్లో ఉన్నవారికి

హైదరాబాద్​లోని గాంధీ, ఫీవర్, నీలోఫర్, కోఠి ఆస్పత్రుల వద్ద ఉన్న కరోనా రోగులతోపాటు వారి సహాయకులకు, వైద్య సిబ్బందికి, ఆర్టీసీ కార్మికులు, పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. భోజనంలో అన్నం, చపాతి, పప్పు, టమోటో రైస్, సాంబర్, రెండు చెట్నీలు, పెరుగుతో పాటు వాటర్ బాటిల్​ను అందిస్తున్నామని తెలిపారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

కరోనా రోగులకు భోజనం అందించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు. వేదం ఫౌండేషన్ ద్వారా లాక్​డౌన్ ముగిసేంత వరకు తమ సేవలు కొనసాగిస్తామని అరవింద్ అలిశెట్టి తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు 9985588821, 99855588831, 99855588841 ఫోన్ చేస్తే వారి ఇంటి వద్దకే మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తామన్నారు.

ఇదీ చదవండి:రావి నారాయణరెడ్డి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details