Opposition Parties Election Campaign :తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను(Congress Party) ఒక్కసారి ఆదరించమంటూ హస్తం నేతలు ఓట్లడుగుతున్నారు. ప్రజాకర్షక హామీలను జనాల్లోకి తీసుకెళ్తూ అధికార పీఠానికి బాట వేస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో మైనంపల్లి రోహిత్ రావు ఇంటింటికి తిరుగుతూ ఓట్లడిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో వొడితెల ప్రణవ్ కుమార్ చేయి గుర్తుకు మద్దతివ్వాలని కోరారు.
నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ - ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
Telangana Assembly Elections 2023 : జగిత్యాల జిల్లా గ్రామీణ మండలంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు తరుగు పేరుతో దోచుకుంటున్నా పట్టించుకోని సర్కారుకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. కేసీఆర్(CM KCR) పాలనలో తెలంగాణ అప్పులకుప్పగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.
Congress Election Campaign :ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎమ్మెల్యే సీతక్క పొలాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో దొరల పాలన నడుస్తోందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన పోయి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.