ఏపీ గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభమయ్యాయి. రెడ్‌క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు రవి శ్రీనివాస్.. ఆక్సిజన్ బ్యాంక్‌ను ప్రారంభించారు. చిరంజీవి అభిమానులు 50 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు. కరోనా బాధితులు తమను సంప్రదిస్తే ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తామని పేర్కొన్నారు.
చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభం - చిరు ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభం
‘బ్లడ్‌బ్యాంక్’, ‘ఐబ్యాంక్’ వేదికలుగా ఇప్పటికే ఎంతోమందికి సేవ చేసిన టాలీవుడ్ నటుడు చిరంజీవి.. మరోసారి తన మాట నిలబెట్టుకుని పెద్ద మనస్సు చాటుకున్నారు. కరోనా బారినపడి సమయానికి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం.. ‘చిరు ఆక్సిజన్ బ్యాంక్’ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
chiru
తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని చిరంజీవి ఇటీవల తెలిపారు. ఈ క్రమంలోనే నేడు అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ‘చిరు ఆక్సిజన్ బ్యాంక్’ సేవలు ప్రారంభమయ్యాయి.