రెండో దశ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసున్నవారిని మాత్రమే ఈనెల 15 నుంచి బల్దియా కార్యాలయాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీనగర్ జోన్ బల్దియా కార్యాలయంతో పాటు సర్కిల్ కార్యాలయాల ఎదుట కరోనా వ్యాక్సిన్ తీసున్నవారిని మాత్రమే కార్యాలయం లోపలికి అనుమతించాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతి - Corona latest updates
తెలంగాణలో కరోనా రెండో దశలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్నవారిని మాత్రమే కార్యాలయాలకు అనుమతించాలని నిర్ణయించింది.
జీహెచ్ఎంసీ వ్యాక్సిన్
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 15లోగా బల్దియా ఉద్యోగులు అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. సిబ్బంది, ఇతర పనులపై వచ్చే పౌరుల్లో కూడా వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే అనుమతించాలని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోని బల్దియా సిబ్బంది మొత్తం 30 వేల మందికి వ్యాక్సిన్ వేసేందుకు వైద్యాధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు.