హైదరాబాద్ దోమలగూడలోని జ్యోతినగర్లో తోపుడు బండి మీద ఓ మహిళ ఉల్లిగడ్డలు విక్రయిస్తుంది. ఎప్పటిలాగానే రాత్రి కాగానే బండి మూసివేసి, ఫుట్పాత్ పక్కన పెట్టి ఇంటికి వెళ్లిపోయింది.
ఇదంతా గమనించిన ఓ వ్యక్తి ఉల్లిగడ్డలపై కన్నువేశాడు. అర్ధరాత్రి ఆ ప్రాంతానికి వచ్చి దాదాపు అరగంట సేపు పచార్లు కొట్టి చివరకు 20 కిలోలకు పైగా ఉల్లిగడ్డలను సంచిలో వేసుకుని వెళ్లాడు.
తెల్లవారుజామున ఉల్లి విక్రయించే మహిళ వచ్చి చూసే సరికి తన బండిలో ఉల్లి తక్కువగా ఉండటం చూసి ఎవరో చోరీ చేశారని నిర్ధారించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించారు.
భాగ్యనగరంలో ఇకపై ఉల్లికి కూడా భద్రత కల్పించాల్సిన అవసరముందని బండి యజమాని ఈశ్వరీ బాయి అన్నారు.
హైదరాబాద్లో 20 కిలోల ఉల్లిగడ్డల చోరీ