తెలంగాణ

telangana

ETV Bharat / state

పొరల పొరల ఉల్లిని.. పోషకాల తల్లిని! - onion prices

కొద్ది రోజులుగా.. ఎక్కడ చూసినా.. నేనే! టీవీ ఛానళ్లలోనూ..  పత్రికల్లోనూ.. నేనే! అంతెందుకు.. సామాజిక మాధ్యమాల్లోనూ నేనే! ఇలా ఎక్కడ చూసినా నేనే.. ఏ ఇంటికి వెళ్లినా.. నా ముచ్చట్లే! ఆఖరుకు పార్లమెంటులోనూ నా చర్చే.. అందుకే నా గురించి మీకు తెలియని విషయాలు  పంచుకుందామని ఇదిగో ఇలా వచ్చా..!!

ONION TELLING ABOUT THEY ARE LIFE STORY
పొరల పొరల ఉల్లిని.. పోషకాల తల్లిని!

By

Published : Dec 10, 2019, 1:53 PM IST

‘మమ్మీ’లతో పాటు మమ్మల్నీ...

  1. నేను మధ్య ఆసియాలో పుట్టానని పలు పరిశోధనలు తేల్చాయి.
  2. నన్ను మొట్టమొదట ఇరాన్‌, పశ్చిమ పాకిస్థాన్‌లో పెంచినట్లు మరి కొందరు చెబుతుంటారు
  3. నన్ను సాగుచేయడానికి ముందే మీ పూర్వీకులు అడవి ఉల్లిని విరివిగా ఆహారంగా వాడారు.
  4. మొత్తానికి నన్ను 5000 సంవత్సరాల పూర్వం నుంచి పెంచుతున్నట్లు పరిశోధనలు తేల్చాయి.
  5. ఈజిప్టులో అయితే ‘మమ్మీ’లతో పాటు మమ్మల్నీ పిరమిడ్లలో ఖననం చేశారు. అప్పట్లోనే మమ్మల్ని చాలా విలువైన వస్తువులుగా గుర్తించేవారు.
  6. కొన్ని పిరమిడ్ల గోడలపైనా.. నా బొమ్మలు గీసి ఉన్నాయి.
  7. అమెరికాలో నా మ్యూజియం కూడా ఒకటి ఉంది.. తెలుసా?

చరకసంహితలోనూ...

  • భారతదేశ ప్రాచీన వైద్య గ్రంథం చరకసంహితలోనూ నా ప్రస్తావన ఉంది. అందులో నన్ను ఔషధంగా చెప్పారు. గుండె, కళ్లు, కీళ్లకు మేలు చేస్తానని నా గురించి రాశారు.
  • కేవలం మన దేశంలోనే కాదు... గ్రీసులోనూ ఔషధంగా వాడేవారు. ముఖ్యంగా ప్రాచీన ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు తమ శరీర పటుత్వం కోసం పెద్దమొత్తంలో నన్ను ఆహారంగా తీసుకునేవారు.
  • రసంగా చేసుకుని తాగేవారు. శరీరాలకూ రాసుకునే వారు.
  • నన్ను ఆహారంగా తీసుకుంటే.. కంటిచూపును మెరుగుపరుస్తానని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. నోటి అల్సర్లు, పుండ్ల నివారణ, పంటినొప్పికి మందుగా వాడేవారు. కుక్కకాటుకూ విరుగుడుగా ఉపయోగించేవారు.
  • అందుకేనేమో.. ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అనే సామెత మీ దగ్గర ఎక్కువగా వాడుతుంటారు!

పోషకాల నిధి...

  1. నా శాస్త్రీయనామం ఆలియమ్‌ సీపా.
  2. నాలో ‘సి’ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది.
  3. పీచుపదార్థం (ఫైబర్‌), ఫోలిక్‌యాసిడ్‌, కాల్షియం, ఐరన్‌, ప్రొటీన్లూ ఉంటాయి.
  4. తక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. కొవ్వు(ఫ్యాట్‌) అసలే ఉండదు.
  5. నాలో సల్ఫర్‌ (గంధకం) కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నన్ను కోసేటప్పుడు మీకు కన్నీళ్లు వస్తాయి.

బ్యాక్టీరియాను ఆకర్షిస్తాను...

  • నేను చూడటానికి మాములుగానే కనిపిస్తాను. పొరలు పొరలుగా ఉంటాను. సాధారణంగా 30 రోజులకు మించి నిల్వ ఉండను.
  • కానీ నా గురించి మీకో విషయం తెలుసా?! నాలో ఉండే కొన్ని రసాయనాలు బ్యాక్టీరియాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. తర్వాత అవి నా ఘాటుకు చనిపోతాయి. బ్యాక్టీరియా పరిమితికి మించి పెరిగితే మాత్రం నా ఆటకట్టుతుంది.
  • అందుకే అప్పుడు నల్లగా మారి పాడైపోతాను.
  • నా పొట్టును మీరు ఎందుకూ పనికిరాదు అని పడేస్తుంటారు కానీ.. దాన్ని కొన్ని దేశాల్లో సహజ సిద్ధమైన రంగుల తయారీకి వాడుతుంటారు. వీటిని వస్త్ర పరిశ్రమలో అద్దకం కోసం ఉపయోగిస్తుంటారు.
  • నా పొట్టును మీరు ఎందుకూ పనికిరాదు అని పడేస్తుంటారు కానీ.. దాన్ని కొన్ని దేశాల్లో సహజ సిద్ధమైన రంగుల తయారీకి వాడుతుంటారు. వీటిని వస్త్ర పరిశ్రమలో అద్దకం కోసం ఉపయోగిస్తుంటారు.
  • నన్ను పెంచడానికి విత్తనాలుగా ఉల్లిపాయలు, గింజలనూ వాడవచ్చు.

మీ ఇంట్లోనూ పెంచుకోవచ్చు!

  1. ‘ఉల్లి ధరలు పెరిగాయ్‌.. పెరిగాయ్‌..’ ఎక్కడ చూసినా.. ఇదే వినిపిస్తోంది కదా! మీ ఇంటి పెరట్లో... లేదా చిన్న కుండీలోనైనా నన్ను ఎంచక్కా పెంచేయొచ్చు.
  2. అన్ని రకాల నేలల్లోనూ నేను పెరుగుతాను.
  3. మరీ ఎక్కువ కాకుండా.. కొద్దికొద్దిగా నీరు అందిస్తే చాలు నేను ఎంచక్కా పెరిగేస్తా.
  4. ఓ సారి నన్ను పెంచేందుకు మీరూ ప్రయత్నించి చూడండి.

సరే ఉంటా మరి..!

ABOUT THE AUTHOR

...view details