ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతితో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై భారత్ ఆంక్షలు విధించింది. వివిధ దేశాల నుంచి అవసరాలకు అనుగుణంగా నడిచే 'వందే భారత్ మిషన్' విమానాల రాకపోకలకు ఈ నిబంధనలు వర్తించవు. ఐతే పరిమిత సంఖ్యలో ఎంపిక చేసుకున్న దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు "ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్స్'' పేరున అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అందులో భాగంగా 28 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. అఫ్ఘనిస్థాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మాల్దీవులు, నేపాల్, నెదర్‌ల్యాండ్స్, నైజీరియా, ఒమెన్, ఖతార్, రష్యా, రువాండా, షీషెల్స్, టాంజానియా, ఉక్రెయిన్, యూఏఈ, యూకే, యూఎస్ఏ, ఉజ్బెకిస్థాన్, శ్రీలంకతో విమాన రాకపోకలపై ఒప్పందం కుదుర్చుకుంది.
శంషాబాద్ నుంచి...