తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో క్రిమిసంహారక మందుపై ప్రభుత్వం నిషేధం

ఆల్ఫా నాప్​థైల్ ఎసిటిక్ ఆసిడ్​ను రైతులు వినియోగించవద్దని... ప్రభుత్వం సూచించింది. ఇది నాసిరకమైన బ్రాండ్​ అని ఛండీనగర్​కు చెందిన పురుగు మందుల పరీక్షా కేంద్రం తెలిపింది. దీనిని ఎక్కడా నిల్వచేయకూడదని... రైతుల గమనించాలని సూచించింది.

one-more-pesticides-ban-in-telangana
మరో క్రిమిసంహారక మందుపై ప్రభుత్వం నిషేధం

By

Published : Sep 17, 2020, 10:05 AM IST

రాష్ట్రంలో మరో క్రిమిసంహారక మందుపై ప్రభుత్వం నిషేధం విధించింది. మెసర్స్ బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్‌కు చెందిన పీఎల్‌ఏడీబీ 19037 బ్యాచ్ నంబర్ కలిగిన... ఆల్ఫా నాప్​థైల్ ఎసిటిక్ ఆసిడ్​ను నిషేధించారు.

ఛండీనగర్‌ వృద్ధి, నియంత్రిక ప్రాంతీయ పురుగు మందుల పరీక్షా కేంద్రం దీనిని నాసిరకం బ్రాండ్​గా గుర్తించింది. ఆ బ్యాచ్‌కు చెందిన ఆల్ఫా నాప్​థైల్ ఎసిటిక్ ఆసిడ్ (4.5 ఎస్‌ఎల్‌) మందును ఎక్కడా నిల్వ చేయకూడదని... ఎరువుల దుకాణాల్లో సైతం అమ్మకూడదని సంస్థ తెలిపింది. రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ క్రిమిసంహారక మందు వినియోగానికి దూరంగా ఉండాలని... వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్ వెల్లడించారు.

ఇదీ చూడండి:విస్తరిస్తోన్న మహమ్మారి.. పల్లెల్లోనే 86 శాతానికిపైగా కొవిడ్

ABOUT THE AUTHOR

...view details