తెలంగాణ

telangana

ETV Bharat / state

రాయదుర్గం పోలీస్ స్టేషన్​కి లక్ష రివార్డ్ - డీజీపీ మహేందర్ రెడ్డి

రాయదుర్గం పోలీస్ స్టేషన్​ను డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజల్లో నమ్మకం పెంచి స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసులకు సూచించారు. స్టేషన్ పనితీరుకి సంతృప్తి చెంది లక్ష రూపాయలు రివార్డ్ ప్రకటించారు.

రాయదుర్గం పోలీస్ స్టేషన్​కి లక్ష రివార్డ్...

By

Published : Aug 3, 2019, 10:54 AM IST

Updated : Aug 3, 2019, 4:18 PM IST

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్​ను డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రజల నమ్మకమే ఆధునిక పోలీసింగ్ కు పునాది అని తెలిపారు. వారి హృదయాలను గెలిచేలా పని చేయాలన్నారు. ప్రజలు, ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగడమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉద్దేశమన్నారు. పౌరులు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్నామని వారే బాసులని చెప్పారు. క్రిమినల్ గ్యాంగ్​లు, పాత నేరగాళ్ల పై నిఘా ఉంచాలని సూచించారు. ఏమిటీ, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎవ్వరు, ఎలా అనే విషయాలను కంప్లైంట్​లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి బ్యారక్స్, ఫీడ్ బ్యాక్ బాక్స్, సీనియర్ సిటిజన్ల కోసం ఏర్పాటు చేసిన ర్యాంప్ చూసి ప్రశంసించారు. స్టేషన్ నిర్వహణను చూసి సంతృప్తి చెంది లక్ష రూపాయలు రివార్డ్ ప్రకటించారు.

రాయదుర్గం పోలీస్ స్టేషన్​కి లక్ష రివార్డ్...
Last Updated : Aug 3, 2019, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details