రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో లక్ష కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. అదేవిధంగా లక్షకు పైగా టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల్లో కరోనాపై అవగాహన పెరిగిందన్నారు.
రాష్ట్రంలో 1100కు పైగా కేంద్రాల్లో వాక్సినేషన్ కొనసాగుతోందని డీహెచ్ తెలిపారు. ప్రస్తుతం 1,064 కేంద్రాల్లో యాంటీజన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో త్వరలోనే ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. రోజుకు 25 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.