దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు రేపటి వరకు పొడిగించారు. రెండో విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువునూ రేపటి వరకు పొడిగించారు. మూడో విడతలో ఇప్పటి వరకు 67,082 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. సీటు పొందిన వారిలో 1,54,557 మంది విద్యార్థులు ఆన్ లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లు తెలిపారు.
దోస్త్ మూడో విడత గడువు పెంపు
దోస్త్ మూడో విడత గడువు రేపటి వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువును పొడిగించారు. ఇప్పటి వరకు 67,082 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మూడో విడత సీట్లను ఈ నెల 15న కేటాయించనున్నట్లు వెల్లడించారు.
దోస్త్ మూడో విడత గడువు పెంపు
సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఈనెల 30 నుంచి నవంబరు 4 వరకు కాలేజీలకు వెళ్లి చేరాలని, లేనిపక్షంలో సీటు కోల్పోతారని కన్వీనర్ పేర్కొన్నారు. మూడో విడత సీట్లను ఈనెల 15న కేటాయించి.. అదే రోజున ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:'దోపిడీ చేసేందుకే ఎల్ఆర్ఎస్ స్కీమ్'
TAGGED:
మూడో విడత దోస్త్ గడువు పెంపు