తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిర్వహణ లోపమే నా కొడుకును చంపేసింది..!' - CEMENT BENCH

పెద్ద పెద్ద భవనాలు... స్విమ్మింగ్ పూల్​లు... చుట్టూ అందమైన పార్కులు... చూసేందుకు ఎంత అందంగా ఉన్నా లోపలంతా అరొకర సదుపాయలు, నాణ్యత లేని భవనాలు. వీటన్నిటి ఖరీదు ఆరేళ్ల బాలుడి ప్రాణం. నాణ్యత లేని అపార్ట్​మెంట్ల కారణంగా మూడు నెలల్లోనే ఇద్దరు పిల్లలు చనిపోవడం బాధాకరం.

అరకొరక సదుపాయాలతో ఆరేళ్ల బాలుడి మృతి

By

Published : Apr 26, 2019, 12:35 PM IST

హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. పార్కులో ఆడుకుంటూ సిమెంట్​ బల్ల మీదపడి ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి ముఖ్యకారణం అపార్టుమెంట్​లో అరకొర సదుపాయాలు ఉండటమేనని బాలుడి తండ్రి చెబుతున్నాడు. తన కొడుకుకు జరిగినట్లు ఇంకెవ్వరికీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. చిన్న చిన్న పిల్లలు ఉన్న చోట్ల అపార్ట్​మెంట్ నిర్వాహకలు జాగ్రత్తగా వ్యవహరించాలని, నాణ్యమైన సదుపాయలు సమకూర్చాలని చెబుతున్నాడు. కేసు దర్యాప్తు పూర్తయితే తప్ప ఏం చెప్పలేమని రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపారు. జీహెచ్​ఎంసీ అధికారులను పిలిపించి అన్ని అపార్ట్​మెంట్లలో తనిఖీలు చేపట్టి సరైన నాణ్యత లేని భవనాలకు నోటీసులిప్పిస్తామని రాజేంద్రనగర్ సీఐ పేర్కొన్నారు.

అరకొరక సదుపాయాలతో ఆరేళ్ల బాలుడి మృతి

ABOUT THE AUTHOR

...view details