శ్రీశైలం మళ్లీ నిండింది. నాగార్జున సాగర్ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు.. రెండు ప్రాజెక్టుల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. జురాల ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున.. శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 1,14,627 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 84, 225 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఈ సీజన్లో ఆరోసారి గేట్లు ఎత్తారు.
సాగర్లోనూ జలకళ