ఆంధ్రప్రదేశ్లో అమరావతి రైతులు చేపట్టిన "న్యాయస్థానం నుంచి దేవస్థానం" మహాపాదయాత్ర (Amaravati Raithu yatra).. ఇవాళ పన్నెండో రోజు కొనసాగనుంది. ప్రకాశం జిల్లాలో ఆరో రోజు సాగుతున్న ఈ యాత్ర (Amaravati Raithu yatra).. ఈరోజు ప్రధానంగా ఒంగోలు నగరంలో కొనసాగనుంది. ముక్తినూతలపాడు నుంచి పాదయాత్ర (Amaravati Raithu yatra) ప్రారంభమైంది. ఒంగోలులో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న బృందావన్ ఫంక్షన్ హాల్ నుంచి.. మంగమ్మ కళాశాల సెంటర్ జంక్షన్ వరకూ సాగనుంది.
అక్కడి నుంచి కర్నూల్ రోడ్ ఫ్లైఓవర్ క్రింద నుంచి అద్దంకి బస్టాండ్ మీదుగా పాత మార్కెట్, కొత్త పట్నం రోడ్ లోని శివాలయం సెంటర్ వరకు సాగనుంది. అనంతరం యాత్ర (Amaravati Raithu yatra) మధ్యాహ్నం బచ్చల బాలయ్య కళ్యాణ మండపం వద్దకు చేరుతుంది. భోజనానంతరం స్టేషన్ రోడ్డు నుంచి కలెక్టర్ ఆఫీస్ మీదుగా నెల్లూరు బస్టాండ్, భాగ్య నగర్ నాలుగో లైన్ నుంచి హౌసింగ్ బోర్డ్, మామిడిపాలెం ట్యాంక్ కాలేజ్ రోడ్డు మీదుగా యాత్ర (Amaravati Raithu yatra) రాత్రికి ఎర్ల చేరుకుంటుంది.
పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పాదయాత్ర (Amaravati Raithu yatra)కు సంఘీభావం తెలిపే వారు రైతుల వెనక మాత్రమే నడవాలని అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతిరావు విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం అనుమతితో పాదయాత్ర (Amaravati Raithu yatra) చేస్తున్నందున నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.