తెలంగాణ

telangana

ETV Bharat / state

పరీక్ష కిట్ల కొనుగోళ్లలో బాబ్జీ మాయాజాలం

ఐ​ఎంఎస్  కుంభకోణంలో తవ్వుతున్న కొద్ది రోజుకో అక్రమం బయటపడుతోంది. వైద్య పరీక్షల కిట్లలో డొల్ల కంపెనీ లెజెండ్​ పేరుతో భారీగా నిధులు మళ్లించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓమ్ని మెడి సంస్థ యజమాని శ్రీహరిబాబు అలియాస్​ బాబ్జీ... నిధుల మళ్లింపులో కీలకంగా వ్యవహరించినట్లు తేలింది.

omni-medi-owner-tried-to-grab-money-by-a-fraud-company-in-examine-kits-purchase
పరీక్ష కిట్ల కొనుగోళ్లలో బాబ్జీ మాయాజాలం

By

Published : Jan 1, 2020, 5:37 AM IST

Updated : Jan 1, 2020, 7:48 AM IST

ఐ​ఎంఎస్ కుంభకోణంలో మరో భారీ అక్రమం బయటపడింది. ఓమ్ని మెడి సంస్థ యజమాని శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ... పరీక్ష కిట్ల కొనుగోలు పేరిట కోట్లు కొల్లగొట్టడానికి లెజెండ్‌ అనే డొల్ల కంపెనీ సృష్టించాడు. అతని కార్యాలయం, ఇళ్లలో అనిశా బృందం జరిపిన సోదాల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి.

శ్రీహరిబాబు పేరుతో 99 కోట్ల రూపాయల విలువైన షేర్లతో పాటు 24 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాలను అనిశా స్వాధీనం చేసుకుంది. శ్రీహరిబాబు భార్య పేరిట మరో రూ.7 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. 2017, 18లో జరిపిన రూ.110 కోట్ల ఐఎంఎస్‌ లావాదేవీలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జరిపిన ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఈ సొమ్ము వెనకేసినట్లు భావిస్తున్నారు. ఆ సొమ్ములో నుంచి ఆదాయపు పన్ను కింద రూ.19 కోట్లు చెల్లించినట్లు బయటపడింది.

లెజెండ్‌ పేరుతో డొల్ల కంపెనీని తన అనుచరుడు కృపాసాగర్‌రెడ్డి పేరిట సృష్టించినట్టు ఏసీబీ విచారణలో వెలుగు చూసింది. తొలుత లెజెండ్‌ కంపెనీకి నిధులు మళ్లించి తిరిగి ఓమ్ని మెడీ సంస్థకు బదిలీ చేసినట్టు బయటపడడం వల్ల శ్రీహరిబాబును అనిశా అదుపులోకి తీసుకుంది. లెజెండ్‌ సంస్థ యజమాని కృపాసాగర్‌రెడ్డి ప్రతినిధి వెంకటేశ్వర్లు కోసం గాలిస్తున్నారు.

తెల్ల రక్త కణాల సంఖ్య, గ్లూకోజ్‌ స్థాయిని పరీక్షించేందుకు అవసరమైన కిట్ల కొనుగోలు పేరుతో ఈ ముఠా అక్రమానికి పాల్పడింది. స్వీడెన్‌కు చెందిన హిమోక్యూ అనే సంస్థ నుంచి పరీక్ష కిట్లను కొని, నిధులను దారి మళ్లించినట్లు విచారణలో తేలింది.

డిస్పెన్సరీల నుంచి ఎలాంటి ఇండెంట్లు రాకుండానే నేరుగా ఐఎంఎస్‌ సంయుక్త సంచాలకురాలు (సస్పెన్షన్‌) పద్మ కార్యాలయంలోనే కొనుగోలు ఉత్తర్వులను సృష్టించి... వాటిపై దేవికారాణి సంతకాలు కూడా చేసినట్టు ఏసీబీ తేల్చింది. మరో వైపు 750 కిట్లను మాత్రమే కొనుగోలు చేసి 1,050 కిట్లను సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించారు. కొల్లగొట్టిన సొమ్ములో దేవికారాణి, పద్మకు ఎంత చెల్లించారనే అంశంపై అనిశా అధికారులు ఆరా తీస్తున్నారు.

Last Updated : Jan 1, 2020, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details