గత ఏడాది డిసెంబరు 20 నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు కరోనా సోకి ఈ ఆసుపత్రుల్లో చేరిన 8,910 మందిలో 515 మంది(5.8%) చికిత్స పొందుతూ మృతిచెందారు. మిగతా 8,395 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రుల్లో మృతి చెందిన వారికి సంబంధించి గుర్తించిన అంశాలివీ..
- 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. ఇలాంటి వారిలో 10.0% మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ లోపు వయసు వారిలో మరణాల రేటు 4.5% ఉంది.
- గుండె రక్తనాళాల సంకోచ వ్యాధి(కరోనరి ఆర్టెరీ డిసీజ్) ఉన్నవారిలో మరణాలు 10.2% ఉండగా.. ఈ సమస్యలేని వారిలో మరణాలు 5.2% నమోదయ్యాయి.
- గుండె వైఫల్యం ఉన్నవారిలో 15.3% మంది మృతి చెందగా.. ఆ సమస్య లేనివారిలో మరణాలు 5.6% నమోదయ్యాయి.
- కార్డియాక్ ఎరిదిమియా సమస్య ఉన్నవారిలో 11.5%.. ఈ సమస్య లేనివారిలో 5.6%..
- ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారిలో 14.2%, లేనివారిలో 5.6%..
- ప్రస్తుతం ధూమపానం అలవాటు ఉన్నవారిలో 9.4%, ఆ అలవాటు ఇప్పుడు లేని వారు, ఎప్పుడూ లేనివారిలో 5.6% మంది మృతి చెందారు.