2014లో తెరాస అధికారంలోకి వచ్చిన అనంతరం బీఎస్పీ నుంచి వచ్చిన ఇంద్రకరణ్కు దేవాదాయ, న్యాయశాఖ ఇచ్చారు. గతంలో జోగు రామన్న నిర్వహించిన అటవీ, పర్యావణ శాఖలను ఇప్పుడు అదనంగా కేటాయించారు.
వారికి పాత శాఖలే...
గత ప్రభుత్వంలో నిర్వహించిన శాఖలే ఇప్పుడు ఆ ముగ్గురికి అవే శాఖలు వచ్చాయి. అదనంగా మరిన్ని శాఖలను కేటాయించారు.
జగదీష్, ఇంద్రకరణ్, తలసాని
తెదేపా నుంచి తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనకు పాత శాఖలనే ఇచ్చారు.
సూర్యాపేట నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన జగదీష్ రెడ్డి తొలి మంత్రివర్గంలో విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం ఆ శాఖను కడియం శ్రీహరికి కేటాయించి జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ విద్యా శాఖ అప్పగించారు.ఇవీ చదవండి:తలసానికి సన్మానం
Last Updated : Feb 20, 2019, 12:09 AM IST