తెలంగాణ

telangana

ETV Bharat / state

Old City Metro Hyderabad : ఓల్డ్​సిటీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పట్టాలెక్కనున్న మెట్రో

KTR on Old City Metro : పాతబస్తీ మెట్రో త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మార్గం మెట్రోరైలు నిర్మాణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మున్సిపల్‌ శాఖ, ఎల్‌ అండ్‌ టీ సంస్థకు స్పష్టం చేసినట్లు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ప్రకటించారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పట్ల హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సంతోషం వ్యక్తం చేశారు.

Metro
Metro

By

Published : Jul 11, 2023, 8:44 AM IST

KTR Tweet on Old City Metro Line :హైదరాబాద్‌ పాతబస్తీలో మెట్రో రైలుప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని పురపాలక శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎల్ అండ్ టీ ఛైర్మన్‌తో సీఎం కేసీఆర్‌ మాట్లాడారని.. త్వరగా చేపట్టాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.

Asduddin Owaisi Reacts on KTR Tweet :పాతబస్తీ మెట్రో పూర్తి చేయాలనే దానిపై మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ పట్ల హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పాతబస్తీ ప్రజలు ప్రజా రవాణా కనెక్టివిటీ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారంటూ ట్వీట్‌ చేశారు. ఇది ఖచ్చితంగా ఓల్డ్‌ సిటీ ప్రజలకు ఉపయోగపడటంతో పాటు మరింత పర్యాటక శోభను తీసుకువస్తుందని పేర్కొన్నారు.

CM KCR Orders to Officials on Old City Metro : హైదరాబాద్​లోని పాతబస్తీ మెట్రో త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మార్గం నిమిత్తం 5.5 కిలోమీటర్ల మెట్రోరైలు నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొనడంతో పాతబస్తీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైలు తొలివిడత కింద 69.2 కిలోమీటర్లు నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని నిర్మించే విషయంలో చేతులెత్తేసింది. ఈ క్రమంలో రాయదుర్గంతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించటంతో పాటు, నిలిచిపోయిన ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తీర్ణం 74.7 కిలోమీటర్లకు అవుతుంది.

మీరు పనులు చేపట్టండి.. అవసరమైన సహకారాన్ని అందిస్తాం : సుమారు ఆరేడు సంవత్సరాలుగా ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గం నిలిచిపోయింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావటంతో అప్పట్లో మజ్లిస్‌ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మార్గాన్ని మళ్లించేందుకు(ఎలైన్‌మెంట్‌) సర్వే నిర్వహించినా ముందడుగు పడలేదు. ఈ క్రమంలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా..మెట్రో మార్గ నిర్మాణానికి సంబంధించి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అదేవిధంగా మున్సిపల్‌ అధికారులతో, ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణియన్‌తో సీఎం మాట్లాడారు. మిగిలిన 5.5 కిలోమీటర్ల మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆ సంస్థకు ముఖ్యమంత్రి చెప్పినట్లు కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details