ప్రఖ్యాత రవాణా సంస్థ ఓలా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రోడ్లపై గుంతల కారణంగా జరిగే ప్రమాదాల నివారణకు, రోడ్డు నాణ్యతను పర్యవేక్షించేందుకు ఇది తోడ్పడుతుందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. నగర అభివృద్ధిలో మొబిలిటి కీలకపాత్ర పోషిస్తుందని జయేష్ రంజన్ పేర్కొన్నారు.
ప్రభుత్వంతో జట్టు కట్టిన ఓలా - REGIONAL INCHARGE
ప్రఖ్యాత రవాణా సంస్థ ఓలా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా నగరంలోని మౌలిక సదుపాయాలు మెరుగు పరచడంతోపాటు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
నగర అభివృద్ధిలో మొబిలిటి కీలకపాత్ర : జయేష్ రంజన్
హైదరాబాద్ నగర మౌలికవసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తమతో కలిసిరావడం పట్ల ఓలా రీజినల్ ఇంఛార్జ్ సందీప్ ఉపాధ్యాయ్ హర్షం వ్యక్తం చేశారు.మౌలిక సదుపాయల కల్పన, ఇంటలిజెన్స్ ఇన్ సైట్ షేర్ చేసుకునేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ఓలా ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి :జాతీయ పార్టీలు విఫలం: కేటీఆర్